Home > ఆంధ్రప్రదేశ్ > Tammineni Sitaram : ఏపీ స్పీకర్ కీలక నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Tammineni Sitaram : ఏపీ స్పీకర్ కీలక నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Tammineni Sitaram  : ఏపీ స్పీకర్ కీలక నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
X

సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను టీడీపీ నుంచి కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లను స్పీకర్ వేటు వేశారు.అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ తన పిటిషన్ లో కోరింది. ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అనంతరం ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించారు. ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి.. వివరణ కోరగా.. పలుమార్లు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుండా గైర్హాజరైన విషయం తెలిసిందే.





ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురిపై అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు సభాపతికి ఫిర్యాదు చేశారు. టీడీపీ తరుపున ఎన్నికై తర్వాత వైసీపీలో చేరిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని తెలుగు దేశం పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్‌ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురూ స్పీకర్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్‌ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురూ స్పీకర్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్‌విప్‌ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ వస్తామని స్పీకర్‌కు తెలిపారు.రెబల్‌ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్‌ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్‌ ముందు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురూ స్పీకర్‌ను కలవలేదు. తర్వాత కూడా శాసన సభ్యులకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్‌ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరు కాలేదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్‌ తమ్మినేని ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.




Updated : 27 Feb 2024 2:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top