Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు అరెస్ట్ తీరుపై గవర్నర్‌ ఆశ్చర్యం : అచ్చెన్నాయుడు

చంద్రబాబు అరెస్ట్ తీరుపై గవర్నర్‌ ఆశ్చర్యం : అచ్చెన్నాయుడు

చంద్రబాబు అరెస్ట్ తీరుపై గవర్నర్‌ ఆశ్చర్యం : అచ్చెన్నాయుడు
X

చంద్రబాబు అరెస్ట్, రిమాండ్తో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీడీపీ నేతలు కలిశారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు గవర్నర్ చెప్పారని అచ్చెన్నాయడు తెలిపారు.

రాష్ట్ర పరిణామాలపై గవర్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్న అచ్చెన్న.. తనకు కూడా తెలియకుండా అరెస్టు చేసినట్లు గవర్నర్‌ అన్నారని చెప్పారు. రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. ‘‘టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తే వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని సర్వే చెబుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని ఐప్యాక్ సర్వేలో తేంది. ఈ క్రమంలోనే వైసీపీ కక్ష్య సాధింపు చర్యలకు దిగింది’’ అని మండిపడ్డారు.

లోకేష్‌ పాదయాత్రను అణచివేయాలని యత్నించారని అచ్చెన్న ఆరోపించారు. కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణమన్నారు. అయితే బాబు మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదని.. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

Updated : 11 Sep 2023 6:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top