Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ బీచ్‌లో సర్కార్ దోపిడీ..ఎంట్రీ ఫీజ్ పెట్టారుగా ..!

విశాఖ బీచ్‌లో సర్కార్ దోపిడీ..ఎంట్రీ ఫీజ్ పెట్టారుగా ..!

విశాఖ బీచ్‌లో సర్కార్ దోపిడీ..ఎంట్రీ ఫీజ్ పెట్టారుగా ..!
X

విశాఖ బీచ్ అందాలు చెప్పక్లర్లేదు. సాగరతీరాన సేద తీరేందుకు నగరవాసులతో పాటు పర్యాటకులు భారీగా తరలివస్తారు. విశాఖలో ఉన్న పలు బీచ్‌లలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదగా గడుపుతారు. ఎలాంటి డబ్బులు లేకుండా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. బీచ్‌కు వెళ్లారంటే మీ జేబులకు చిల్లులు పడడం ఖాయం. బీచ్‎లో ప్రవేశానికి ఏపీ ప్రభుత్వం ఎంట్రీ ఫీజు పెట్టేసింది. మనిషికి రూ.20 ఇస్తేనే బీచ్ లోపలకి అనుమతిస్తారు. అయితే నగరంలోని అన్ని బీచ్ లలో కాకుండా రుషికొండ బీచ్‌లో మాత్రమే ఎంట్రీ టికెట్‌ను తీసుకొచ్చారు. ఈనెల 11వ తేది నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. పదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కలదు. బ్లూఫ్లాగ్‌ బీచ్‌ నిర్వహణ, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే ఈ రుసుము వసూలు చేయాల్సి వస్తుందని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.

రుషికొండ బీచ్‌‌కు అంతర్జాతీయ బ్లూఫ్లాగ్‌ గుర్తింపు దక్కడంతో రూ.7 కోట్లతో వసతులు కల్పించారు. ప్రత్యేకంగా బీచ్ మేనేజర్‌ను, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా ఏపీటీడీసీకి భారంగా మారింది. ప్రతి నెల బీచ్ మెయింట్ నెన్స్ కు రూ.15 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో అధికారులు పర్యాటకుల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంట్రీ టికెట్‌తో పాటు వాహనాల పార్కింగు ఫీజు, స్నానాల గదుల ఛార్జీలు అదనంగా ఉంటాయి. గతంలో మరుగుదొడ్ల వినియోగానికి వసూలు చేసే రూ.10ని మాత్రం రద్దు చేశారు. ఎంట్రీ టికెట్ ద్వారా మరిన్ని అదనపు వసతులు కల్పించనున్నట్లు పర్యాటకశాఖ అధికారి శ్రీనివాస్‌ పాణి తెలిపారు. రాష్ట్రంలో బీచ్‌ సందర్శనకు ఛార్జీలు వసూలు చేయడం ఇదే తొలిసారి.

Updated : 8 July 2023 11:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top