Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో తప్పిన రైలు ప్రమాదం

ఏపీలో తప్పిన రైలు ప్రమాదం

ఏపీలో తప్పిన రైలు ప్రమాదం
X

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం నేపథ్యంలో దేశం ఏ మూల రైళ్లు కాస్త దారితప్పినా గుండె గుభిళ్లుమంటోంది. ఆ దుర్ఘటన తర్వాత ఒడిశాలోనే గూడ్సురైలు పట్టాలు తప్పింది. మరికొన్ని చోట్ల కూడా చిన్నాచితకా ప్రమాదాలు జరిగాయి. ఏపీలోనూ ఓ రైలు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణాపాయమూ సంభవించలేదు. ఆదివారం అర్ధరాత్రి దాటక మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (Machilipatnam-Tirupati express) రైల్లో భారీస్థాయిలో పొగలు కమ్ముకున్నాయి. రైలు తిరుపతి వెళ్తుండగా ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద బోగీల్లోకి దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే చైన్‌ లాగి రైలును ఆపి రైలు దిగి అధికారులకు సమాచారం అందించారు. రైలు బ్రేకుల్లోని లూబ్రికెంట్ అయిపోవడం వల్ల చక్రాలు రాపిడికి గురై మంటలు లేచినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకుని 20 నిమిషాల తర్వాత రైలును ముందుకు నడిపారు.

Updated : 5 Jun 2023 4:42 PM IST
Tags:    
Next Story
Share it
Top