Home > ఆంధ్రప్రదేశ్ > రాహుల్‌ ప్రధాని అయ్యాక.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే: షర్మిల

రాహుల్‌ ప్రధాని అయ్యాక.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే: షర్మిల

అధికారంలోకి రాగానే తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే

రాహుల్‌ ప్రధాని అయ్యాక.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే: షర్మిల
X


కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదాపై తొలి సంతకం చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ప్రకటించారు. అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం చేస్తామన్నారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని.. "ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

తిరుపతిలో ఇదే మైదానం వేదికగా ఆనాడు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. ఆంధ్ర ప్రజల అవేదన నాకు తెలుసు అన్నాడని.. అధికారం వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా ఇస్తా అన్నాడన్నారు. ఆంధ్ర రూపు రూపు రేఖలు మారుస్త అన్నాడు కానీ.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. "న్యూ ఢిల్లీ చిన్నబోయే రాజధాని సహకారం అన్నాడు.. ఆంధ్రలో హర్డ్ వేర్ హబ్ అన్నాడు..ఇంధన యూనివర్సిటీ అన్నాడు ..ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేక పోయాడని" విమర్శించారు. హోదా పై మూడు నామాల వానికే మోదీ పంగనామాలు పెట్టాడని విమర్శించారు.

హక్కుల సాధనలో బాబు,జగన్ విఫలం అయ్యారని.. ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదన్నారు. విభజన జరిగి 10 ఏళ్లు దాటినా... ఒక్క హామీ సాధించుకొలేదున్నారు. 15 ఏళ్లు హోదా కావాలని బాబు అడిగారు .. తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టారు.. ఊసరవెల్లిలా రంగులు మార్చారు.. ఆయన రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. ‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి" అని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో ఉందని.. అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్నా.. ప్రత్యేక హోదా కోసం చేరానన్నారు.


Updated : 1 March 2024 2:23 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top