Home > ఆంధ్రప్రదేశ్ > స్టీరింగ్‌ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు బోల్తా..19 మందికి గాయాలు

స్టీరింగ్‌ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు బోల్తా..19 మందికి గాయాలు

స్టీరింగ్‌ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు బోల్తా..19 మందికి గాయాలు
X

శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా డ్రైవర్ చేతిలోని స్టీరింగ్ విరగడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసన్నపేట సమీపంలోని జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డు మధ్యలో పడిపోయిన బస్సును అక్కడనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Updated : 6 Jun 2023 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top