Home > ఆంధ్రప్రదేశ్ > విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురు మృతి

విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురు మృతి

విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురు మృతి
X

విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో కండక్టర్‌తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు. బస్సు కిందపడి మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్ 12 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్రయాణికుల పైకి బస్సు దూసుకుపోవడంతో ఆర్టీసీ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా బస్సు మీదకు దూసుకు వచ్చి బీభత్సం సృష్టించడంతో బస్టాండ్‌లోని ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





ఈ ప్రమాద సమయంలోనే ఏపీలోని మరో జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు కిందపడి దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారు రామాంజనేయులు (35) అనిత (27) లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ బస్సుని అక్కడే వదిలేసి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సుల కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు








Updated : 6 Nov 2023 4:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top