Home > ఆంధ్రప్రదేశ్ > విజయవాడ బస్సు బీభత్సం... వీడియో

విజయవాడ బస్సు బీభత్సం... వీడియో

విజయవాడ బస్సు బీభత్సం... వీడియో
X

విజయవాడ బస్టాండ్ లో ఆర్టిసీ బస్సు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ మెట్రో లగ్జరీ బస్సు అదుపుతప్పి బస్టాండ్ లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్లాట్ ఫారం నుండి బస్టాండ్ లోని దూసుకెళ్లి ఓ కండక్టర్ తో పాటు మహిళ, పదినెలల చిన్నారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు బస్సు చక్రాలకింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ భయానక బస్సు ప్రమాద దృశ్యాలను వీడియోలో రికార్డ్ అయ్యాయి. బస్సు ఒక్కసారిగా బస్టాండ్ లోకి దూసుకువచ్చి కూర్చీలపై కూర్చున్న కండక్టర్, తల్లీబిడ్డపైకి దూసుకెళ్లిన భయానక దృశ్యాలతో కూడిన వీడియో బయటకు వచ్చింది.

ఈ బస్సు ప్రమాద దుర్ఘటనకు.. ఆర్టీసీ అధికారులే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైవర్‌కు సరిగ్గా శిక్షణ ఇవ్వకుండానే ఆటోట్రాన్స్‌మిషన్‌ బస్సులో విధులు అప్పగించడమే ఘోరం జరగడానికి కారణంగా తెలుస్తోంది. అధునాతన సాంకేతికత కలిగిన బస్సు నడిపేందుకు రెండు రోజుల శిక్షణ సరిపోలేదన్నా.. అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. బస్సులో ఎక్స్‌లేటర్‌ స్తంభించడం ప్రధాన కారణంగా తెలుస్తుండగా.. ఈ సమస్యపై పలుమార్లు డ్రైవర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీస మరమ్మతు చేయకుండానే సర్వీసు కొనసాగించారు. వాస్తవాలను కప్పిపుచ్చి డ్రైవర్‌నే ప్రమాదానికి బాధ్యుడుగా చేసి చేతులు దులిపేసుకునేలా విచారణ నివేదిక సిద్దం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.



Updated : 7 Nov 2023 4:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top