వల్లభనేని వంశీకి షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
X
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 సార్వత్రికి ఎన్నికల సమయంలో ప్రసాదంపాడు ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు 38 మందిపై కేసులు నమోదు చేశారు. అందరిపై నాలుగు కేసులను నమోదు చేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు విచారణకు వల్లభనేని వంశీ హాజరు కాకపోవడంతో కోర్టు గతంలో ఆయనకు బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
తాజాగా ఈ కేసు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే వల్లభనేని వంశీ కోర్టులో హాజరు కాలేదు. దీంతో విచారణకు హాజరుకాని వల్లభనేని వంశీపై సుప్రీం కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. వంశీతో పాటుగా ఈ కేసులో మరో 38 మంది వరకూ ఉన్నారు. తన అరెస్ట్ వారెంట్ విషయంపై వల్లభనేని వంశీ ఇంత వరకూ స్పందించలేదు. నేడు పోలీసులు ఆయన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది.