Home > ఆంధ్రప్రదేశ్ > టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల్లో చంద్రబాబు, జగన్..

టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల్లో చంద్రబాబు, జగన్..

టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల్లో చంద్రబాబు, జగన్..
X

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆస్తుల విలువ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు పొలిటికల్ లీడర్స్ అంటేనే కోట్లు ఆస్తులుంటాయనే ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ విడుదల చేసింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకరాం దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తి 1400 కోట్లుగా ఉంది.





ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. టాప్ టెన్ ధనిక ఎమ్మెల్యేల్లో వీరు 4, 7 స్థానాల్లో నిలిచారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రూ.668 కోట్లతో 4వ స్థానంలో ఉండగా.. 510 కోట్లతో ఏపీ సీఎం జగన్ 7వ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి వీరిద్దరే టాప్ 20లో ఉన్నారు. ఇక అతి తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే అయిన నిర్మల్ 2వేల ఆస్తి మాత్రమే ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

దేశ వ్యాప్తంగా తొలి 20 మంది ధనిక ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్‌ నుంచే ఉన్నారు. కర్ణాటకలో 14శాతం మంది ఎమ్మెల్యేలు ధనికులే.. వారి వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటేనని ఏడీఆర్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉంది.. అక్కడ మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు. 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 4,001 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్‌ల ఆధారంగా ADR నివేదిక రూపొందించింది.




Updated : 21 July 2023 10:06 AM IST
Tags:    
Next Story
Share it
Top