బాబు అరెస్టైనా జనాలు పట్టించుకోవడం లేదు.. అచ్చెన్నాయుడు ఆడియో లీక్
X
చంద్రబాబు అరెస్ట్ ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన లేదని పార్టీ నేతల వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. ఈ సమయంలోనే విజయవాడలో జనసమీకరణపైన అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చంద్రబాబును అరెస్ట్ చేసినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదని అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకి తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరని అచ్చెన్న అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్గా మారింది.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. మరికాసేపట్లో న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి.