Home > ఆంధ్రప్రదేశ్ > విషాదం.. విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్..

విషాదం.. విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్..

విషాదం.. విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్..
X

ఆన్లైన్ గేమ్ ఓ అమ్మాయి ప్రాణం తీసింది. ఫీజు కోసం ఇచ్చిన పైసలు గేమ్లో పోగొట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తురకపల్లికి చెందిన పోలు కవిత ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. కాలేజీ ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఆమెకు రూ.2.50లక్షలు ఇచ్చారు. అయితే ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడిన కవిత ఇంకా డబ్బు వస్తుందన్న ఆశపడింది. పేరెంట్స్ ఇచ్చిన డబ్బంతా ఆన్ లైన్ గేమ్ ఆడి పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన కవిత ఈ నెల 15న పురుగుల మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందడంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 20 Jun 2023 4:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top