Home > ఆంధ్రప్రదేశ్ > సీఐ స్వర్ణలతకు బెయిల్‌ !

సీఐ స్వర్ణలతకు బెయిల్‌ !

సీఐ స్వర్ణలతకు బెయిల్‌ !
X

ఏపీలో సంచలనం సృష్టించిన నోట్లమార్పిడి కేసులో ఏఆర్‌ సీఐ స్వర్ణలతకు బెయిల్ మంజూరైంది. ఆమెతో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు విశాఖ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.దీంతో వారు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదల అవుతారు.

కేసు నేపథ్యమిదే..

రిటైర్డ్ నేవి అధికారులు శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను.. మార్చుకునేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఐతే, నగదు మార్పిడిలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు సూరిబాబు.. ఏఆర్‌ ఇన్ స్పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్, శ్రీనును ఆశ్రయించారు. అయితే ఆ అధికారులను బెదిరించి సీఐ స్వర్ణలత అండ్ గ్యాంగ్ లక్షల్లో నగదును కొట్టేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమెతో పాటు కారు డ్రైవర్, ఏఆర్ కానిస్టేబుల్ మెహర్, హోంగార్డు శ్రీనుతో పాటు బ్రోకర్ సూరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. విశ్రాంత నేవీ అధికారులు తీసుకొచ్చింది రూ.90 లక్షలు కాదు.. రూ.12 లక్షలు అని పేర్కొన్నారు. అసలు ఆ రూ.90 లక్షలు సంగతేంటనే ప్రశ్న మొదలైంది. రిమాండ్ రిపోర్టులో కూడా ఎక్కడా ఆ రూ.90 లక్షల ప్రస్తావన రాకపోవడం చర్చనీయాంశమైంది.

Updated : 21 July 2023 7:55 PM IST
Tags:    
Next Story
Share it
Top