Home > ఆంధ్రప్రదేశ్ > Balakrishna: జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ రియాక్షన్

Balakrishna: జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ రియాక్షన్

Balakrishna: జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ రియాక్షన్
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పలువురు ప్రముఖులు సైతం స్పందించారు. ఈ క్రమంలో.. తెలంగాణ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. అయితే.. అరెస్టయిన చాలా రోజుల తర్వాతే బీఆర్ఎస్ నేతలు స్పందించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇదే అంశంపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓట్ల కోసమే ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారని.. బాలకృష్ణ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలతో బాలయ్య భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే చంద్రబాబునాయుడిపై అబద్ధపు కేసులు పెట్టారని బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబును రిమాండ్‌లోకి తీసుకున్న అనంతరం సెక్షన్‌లు చెబుతున్నారని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారని వెల్లడించారు. అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తనకు అవగాహాన లేదని తెలిపిన ఆయన... అనవసరంగా ఎవరిపైనా తాము నిందలు వేయమని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తన అక్క పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ వెల్లడించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశంపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తానని తెలిపారు. సినిమా వాళ్లు స్పందించక పోవడంపై తాను పట్టించుకోనని.. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అన్నారు.

కాగా, ఇంతవరకు ఈ అరెస్ట్ ఇష్యూపై జూనియర్ ఎన్టీఆర్ అస్సలు స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ మౌనం హాట్ టాపిక్ గా మారింది. జూ.ఎన్టీఆర్ సైలెన్స్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా బాలయ్య.. సినిమా వాళ్లు స్పందించకపోయినా నేను పట్టించుకోను, జూ.ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ అని తేల్చి చెప్పారు. ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ అనడం హాట్ టాపిక్ గా మారింది.

Updated : 5 Oct 2023 8:13 AM IST
Tags:    
Next Story
Share it
Top