బాలినేనికి సీఎం జగన్ పిలుపు..అలక వీడతారా ?
X
ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో పార్టీలో విభేదాలు వైసీపీని కలవరపెడుతున్నాయి. అందులో ప్రకాశం జిల్లా రాజకీయాలు ప్రధానమైనవి. మాజీ మంత్రి బాలినేని అలక పార్టీకి తలనొప్పిగా మారింది. కో-ఆర్డినేటర్ పదవికీ రాజీనామా చేయడంతో పాటు...పార్టీ కార్యకలాపాల్లో కూడా యాక్టివగ్ లేకపోవడం చర్చనీయాంశమైంది. అదే విధంగా సొంతపార్టీపైనే బహిరంగ విమర్శలకు దిగుతుండడం ఇబ్బందిగా మారింది. దీనిని ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలిచడం లేదు. ఇప్పటికే బాలినేనితో సీఎం జగన్ మాట్లాడిన... అతడు వెనక్కు తగ్గలేదు. బాలినేని డిమాండ్లు నెరవేకపోవడంతో సమయం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి వైఎస్ జగన్ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి కబురు అందింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు రావాలంటూ సమాచారమందించారు. ఈ సమవేశంలో బాలినేని ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, డిమాండ్‌లు సీఎం జగన్ లెలుసుకోనున్నారు.
టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో బాలినేనికి అంతర్గత విభేదాలు ఉన్నాయి. వాటి కారణంగానే బాలినేని గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు తనకు బంధువులు కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డే డైరెక్ట్ గా రంగంలోకి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో బాలినేని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. పార్టీలో సీఎం జగన్‌ను తప్ప ఎవరినీ లెక్క చేయనన్నారు. తన జోలికి వస్తే ఊరుకోబోనని, ఎవ్వరినైనా ఎదిరిస్తాననీ హెచ్చరించారు.