Home > ఆంధ్రప్రదేశ్ > నీ కూతురి పెళ్లి ఎలా అయింది... టీటీడీ చైర్మన్‌పై బండి సంచలన వ్యాఖ్యలు

నీ కూతురి పెళ్లి ఎలా అయింది... టీటీడీ చైర్మన్‌పై బండి సంచలన వ్యాఖ్యలు

నీ కూతురి పెళ్లి ఎలా అయింది... టీటీడీ చైర్మన్‌పై బండి సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిత్యం వివాదాలతో బండి నడిపించిన బండి సంజయ్ ఏపీలోనూ హల్‌చల్ చేస్తున్నారు. పార్టీ ఏపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన జోరు పెంచారు. మతానికి సంబంధించిన అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. తిరుమల దారిలో చిరుతపులుల దాడి అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఇదివరకు పులులు లేవని, అకేసియా చెట్ల వల్లే అవి అక్కడికి వస్తున్నాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి మండిపడ్డారు. ‘‘అడవులే లేకపోతే పులులు ఎలా వస్తున్నాయి? ఆయనకు పుష్ప సినిమా చూపించాలి. అసలు హిందువు కాని వ్యక్తికి, సనాతన ధర్మంపై అవగాహన లేని వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టి హిందువులను ఘోరంగా అవమానిస్తున్నారు. ఈ సంగతిని దేశంలోని హిందువులందరూ గమనించాలి’’ అని అన్నారు. భూమనకు టీటీడీ ఛైర్మన్ అయ్యే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ‘‘ఆయన కూతురు పెళ్లి ఏ మత సంప్రదాయం ప్రకారం జరిగింది? ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఏ మతానికి చెందిన వ్యక్తి అని చెప్పుకున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

తిరుమల నడక దారిలో అకేసియా చెట్ల వల్ల మిగతా చెట్లు అంతరించిపోవడంతో అక్కడి సాధు జంతువులు వేరే చోటుకు వెళ్లాయని, పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయని భూమన అంటున్నారు. ఆయన తను క్రైస్తవుడినని అఫిటవిట్లో చెప్పుకున్నట్లు తెలియడం లేదు. ఆయన కూతురు నీహా రెడ్డి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ రవీంద్రారెడ్డి కొడుకును పెళ్లి చేసుకుంది. వారి పెలల్ క్రైస్తవ మత సంప్రదాయంలో జరిగింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం హిందూమతాన్నే పాటిస్తున్నారు.

Updated : 22 Aug 2023 9:32 PM IST
Tags:    
Next Story
Share it
Top