ఏపీలో కులగణన మళ్లీ వాయిదా.. ఈసారి వానలు అడ్డు..
X
ఆంధ్రపదేశ్ బీసీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కులగణనకు మళ్లీ ఆటంకం కలిగింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన గణన తాజాగా వర్షాల కారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9న జరగాల్సిన సమగ్ర కుల గణన మిగ్‌జామ్ తుపాను వల్ల మరోసారి వాయిదా వేయాల్సి వచ్చిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గురవారం చెప్పారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవాల్సి ఉందని, ఆయన చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కులగణన తేదీలను ప్రకటిస్తామన్నారు.
ఏపీ ప్రభుత్వం వాస్తవానికి నవంబర్ 27 నుంచే కుల గణన మొదలుపెట్టాలని నిర్ణయించింది. కానీ కులగణన మెరుగ్గా ఉండేందుకు బాగా కసరత్తు చేస్తున్నామంటూ డిసెంబర్ 9కి వాయిదా వేసింది. మిగ్‌జామ్ తుపాను రావడంతో మళ్లీ వాయిదాపడింది. దేశంలో బిహార్ తర్వాత కులగణన నిర్వహిస్తున్న ఏపీ అన్ని కులలకు న్యాయం చేయడానికే ఈ చర్య చేపట్టామని చెబుతోంది. దేశంలో చివరిసారి 1931లో బీసీకులగణన జరిగింది. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే వారి జనాభాకు దగ్గట్టు చట్టసభల్లో, ప్రభుత్వోద్యోగాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చాక బిహార్ తొలిసారి కులగణన జరిపింది.