Home > ఆంధ్రప్రదేశ్ > అలిపిరి మార్గంలో కనిపించిన చిరుతలు

అలిపిరి మార్గంలో కనిపించిన చిరుతలు

అలిపిరి మార్గంలో కనిపించిన చిరుతలు
X

తిరుమలలో వన్యమృగాల సంచారం కొనసాగుతోంది. అలిపిరి నడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.

అలిపిరి నడకమార్గంలో ఏడో మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో రెండు చిరుతలు, ఓ ఎలుగుబంటి తిరుగుతున్నట్లు కనిపించాయి. శుక్ర, శనివారాల్లో వాటి కదిలికలను గుర్తించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం సమయంలో నరసింహస్వామి ఆలయ సమీపంలో ఎలుగుబంటి కనిపించింది. వన్య మృగాల సంచారంపై నిఘా పెట్టామని వాటి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని అధికారులు చెప్పారు. అందుకు అనుగుణంగా నడక దారిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. సర్వదర్శనం కోసం కేవలం ఒక్క కంపార్టుమెంటులోనే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ లేని భక్తులు 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం 79,444 మంది భక్తులు వెంకటేశ్వరున్ని దర్శించుకున్నారు. 28వేల మందికిపైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం శ్రీవారికి రూ.4.21 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

Updated : 21 Aug 2023 4:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top