Home > ఆంధ్రప్రదేశ్ > భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్

భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్

భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్
X

నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందని భువనేశ్వరి మాటలు బట్టి అర్ధం అవుతోందన్నారు. కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు... ఈసారి నన్ను గెలిపిస్తారా? అంటూ భువనేశ్వరి కుప్పంలో సరదాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పనైపోయిందని భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో, ఇవాళ ఆమె కూడా అదే చెప్పారని తెలిపారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు.

ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారు.. కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. వైసీపీ సర్కారు కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం అర్థమైంది కాబట్టే, నారా భువనేశ్వరి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని అందరూ నవ్వుకుంటున్నారు. కుప్పం ప్రజలకే ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ చేయలేడని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కుప్పం సహా 175కి 175 స్థానాల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ రోజా ధీమా వ్యక్తం చేశారు. "చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది.. కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందని ఆమె అన్నారు.




Updated : 21 Feb 2024 10:06 PM IST
Tags:    
Next Story
Share it
Top