Home > ఆంధ్రప్రదేశ్ > ర్యాలీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేపై బాంబు దాడి

ర్యాలీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేపై బాంబు దాడి

ర్యాలీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేపై బాంబు దాడి
X

సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (అక్టోబర్ 8) ఎమ్మెల్యే శంకర నారాయణ గోరంట్లలో అభిమానులు, అనుచరులతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఎమ్మెల్యేపై నాటు బాంబు విసిరాడు. అయితే ఆ నాటు బాంబు పేలకపోవడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎమ్మెల్యేకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబు దాడి చేయడానికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. అయితే ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు, అనుచరులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.




Updated : 8 Oct 2023 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top