Home > ఆంధ్రప్రదేశ్ > నేటి నుంచి మూత పడనున్న బొర్రా గుహలు

నేటి నుంచి మూత పడనున్న బొర్రా గుహలు

నేటి నుంచి మూత పడనున్న బొర్రా గుహలు
X

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యటక కేంద్రమైన బొర్రా గుహలు మూత పడనున్నాయి. 2017 నుంచి పెండింలో ఉన్న తమ డిమాండ్లను పరిష్నరించాలని టూరిజం శాఖ కార్మికులు స్ట్రైక్ చేస్తున్నాయి. గతంలో అధికారులతో కార్మికులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శనివారం (నవంబర్ 11) నుంచి నిరవధిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని టూరిజం మొత్తం మూతపడనుంది.

మూత పడుతున్న టూరిస్ట్ ప్లేసుల్లో.. తైడా జంగిల్‌ బెల్స్‌, బొర్రా గుహలు, అనంతగిరి హిల్‌ రిసార్ట్స్‌, అరకులోయలోని హరిత వ్యాలీ, మయూరి హిల్‌ రిసార్టులు, లంబసింగి ఉన్నాయి. వీటి రిసార్టులో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో బొర్రా గుహలతోపాటు పర్యాటక ప్రాంతాలు, టూరిజం శాఖ అతిథి గృహాలు మూతపడనున్నాయి. దీంతో ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న పర్యాటకుల్లో టెన్షన్‌ నెలకొన్నది. టూర్ కు వెళ్లాలా.. టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాలా అని ఆలోచనలో పడ్డారు.


Updated : 11 Nov 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top