Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ను చూస్తే జాలేస్తోంది.. ట్యూషన్స్ చెప్తా : మంత్రి బొత్స

పవన్ను చూస్తే జాలేస్తోంది.. ట్యూషన్స్ చెప్తా : మంత్రి బొత్స

పవన్ను చూస్తే జాలేస్తోంది.. ట్యూషన్స్ చెప్తా : మంత్రి బొత్స
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. పవన్ ట్వీట్కు సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో టెండర్లన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా కేటాయించామని బొత్స స్పష్టం చేశార. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చెప్పారు. ఏపీ విద్యావ్యవస్థ అత్యంత పారదర్శకమైన విభాగమని అన్నారు.

పవన్కు వీటన్నింటి గురించి తెలియకపోతే.. ట్యూషన్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని బొత్స కామెంట్ చేశారు. అయితే ముందుగా తాను ఇచ్చే హోం వర్క్ను పవన్ పూర్తి చేయాలని కండీషన్ పెట్టారు. ‘‘ప్రతీసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయం. అది చూసి నాకు కూడా జాలేస్తోంది. మీ మెదడులో పదును పెంచేందుకు నేను ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని ట్వీట్ చేశారు.

అంతకముందు వైసీపీని విమర్శిస్తూ పవన్ ట్వీట్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ రిక్రూట్మెంట్, టీచర్ ట్రైనింగ్ వంటివి ఎక్కడా అని ప్రశ్నించారు. నష్టాలు వచ్చే స్టార్టప్ లకు మాత్రం కోట్లలో కాంట్రాక్టులు వస్తున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించదా అని అడిగారు. టెండర్ల కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? అని ప్రశ్నించారు.

చంద్రబాబుతో భేటీ..

మరోవైపు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పవన్ భేటీ కానున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాలు, పొత్తులపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు, పవన్ మూడు సార్లు సమావేశమయ్యారు. పవన్ ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి సమాశంలో పాల్గొన్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీటన్నింటిపై పవన్ చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది.

Updated : 23 July 2023 1:56 PM IST
Tags:    
Next Story
Share it
Top