Home > ఆంధ్రప్రదేశ్ > తెలంగాణ మంత్రులకు రెండ్రోజుల తర్వాత జవాబిస్తా.. బొత్స

తెలంగాణ మంత్రులకు రెండ్రోజుల తర్వాత జవాబిస్తా.. బొత్స

తెలంగాణ మంత్రులకు రెండ్రోజుల తర్వాత జవాబిస్తా.. బొత్స
X

తెలంగాణ విద్యావిధానం లోపభూయిష్టమని, అక్కడన్నీ చూచిరాతలు, కుంభకోణాలేనని కలకలం రేపిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలంగాణ నేతలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. ముందు ఏపీని చక్కబెట్టుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే హైదరాబాద్‌కు రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. అసలు ఏపీ రాజధాని ఏదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. దీనిపై బొత్స స్పందిస్తూ, ‘‘ఇప్పుడేమీ మాట్లాడను. రెండు రోజుల తర్వాత వారి గురించి మాట్లాడతాను’’ అని శుక్రవారం చెప్పారు. డీఎస్సీ కోసం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన టీచర్ ఖాళీల వివరాలు తెలుసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలని బొత్స కొట్టిపడేశారు. ప్రజల సొమ్మును మెక్కింది టీడీపీ నేతలనేని ఎదురు దాడి చేశారు.

బొత్స గురువారం ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేస్తూ రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థలను పోల్చారు. చేశారు. ‘మా రాష్ట్ర విద్యావిధానాన్ని తెలంగాణతో పోల్చలేం. అక్కడంతా చూచిరాతలు, కుంభకోణాలే. కనీసం టీచర్లను బదిలీలు కూడా చేసుకోలేకపోతున్నారు’’ అని అన్నారు.

Updated : 14 July 2023 10:36 PM IST
Tags:    
Next Story
Share it
Top