Brahmani : మంగళగిరిలో పర్యటించిన నారా బ్రహ్మణి..
X
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో నారా బ్రహ్మణి పర్యటించారు. చేనేత డైయింగ్ షేడ్‌ను పరిశీలించిన అనంతరం ఆమె ఆటోనగర్‌లో వీవర్‌శాల ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు. చేనేత కార్మికుల సమస్యలను బ్రహ్మణి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ బరిలో దిగనున్నారు.ఈ నేపథ్యంలో బ్రహ్మణి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి మంగళగిరి. అక్కడ్నుంచి నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా పట్టుదలగా ఐదేళ్లుగా అక్కడి నుంచే పని చేసుకుంటున్నారు. సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల్లో తిరిగారు. ఇప్పుడు తనకు యాభై వేల మెజార్టీ వస్తుందని ధీమాగా చెబుతున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడటంతో మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగానికి తెర లేపారు సీఎం జగన్.. స్థానికంగా పద్మశాలీల ఓట్లు ఎక్కువ ఉండటం అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చీరంజీవిని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆయన అందర్నీకలుపుకోలేక పోతున్నారని.. బలంగా పోటీ ఇవ్వలేరన్న సర్వే రిపోర్టులు రావడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి వైపు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మరుగుడు హన్మంతరావు కూడా వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ రేసులోకి వచ్చి వైసీపీ పెద్దలతో చర్చించారు. కమలతోపాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సైతం తన కోడలిని ఎన్నికల బరిలో దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో వైపు నియోజవర్గంలో అభ్యర్తిని వారంలో ఖరారు చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.