Buddha Venkanna: రక్తంతో చంద్రబాబు కటౌట్‌కు అభిషేకం.. బుద్ధా వెంకన్న స్వామి భక్తి
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తన స్వామి భక్తిని చాటుకున్నారు బుద్దా వెంకన్న(Buddha Venkanna ). రక్తంతో చంద్రబాబు కటౌట్‌కు అభిషేకం చేశారు. చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వకపోయినా, టికెట్‌పై ఏ నిర్ణయం తీసుకున్నా తాను విమర్శించనని చెప్పారు. పెడితే పెళ్లి కూడు, పెట్టకపోతే చావు కూడు అనే మనిషిని తాను కాదని.. చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు తన గౌరవం పెంచారు కానీ ఎక్కడా తగ్గించలేదన్నారు. చంద్రబాబు అంటే తన విపరీతమైన స్వామి భక్తి అని చెప్పిన బుద్ధా వెంకన్న.. చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. స్వామి భక్తిని నిరూపించుకునేందుకే రక్తంతో అభిషేకం చేసినట్లు చెప్పారు.
కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కేశినేని నాని( Kesineni Nani ) వచ్చిన తరువాత తనను తీసేయాలంటూ చంద్రబాబుకు పదే పదే చెప్పేవాడని, వేరే వాళ్లకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.తనను పార్టీ నుంచి తప్పించాలనేది కేశినేని నాని ఎజెండా అని మండిపడ్డారు. పోరాటం చేసేవారిలో తానొక బ్రాండ్ అని అన్నారు.