Home > ఆంధ్రప్రదేశ్ > పవన్పై ట్వీట్.. ఆర్జీవీపై పోలీస్ కేస్..

పవన్పై ట్వీట్.. ఆర్జీవీపై పోలీస్ కేస్..

పవన్పై ట్వీట్.. ఆర్జీవీపై పోలీస్ కేస్..
X

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు రిజిస్టరైంది. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. అయితే ఈ ట్వీట్‌పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆర్జీవీ చేసిన ట్వీట్ శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. అలాగే ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని గంగాధర్ ఫిర్యాదులో రాశారు. రామ్ గోపాల్ వర్మపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కృష్ణాయపాలెం వాసులు కూడా ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ తనదైన స్టైల్లో పవన్ కల్యాణ్‎కు కౌంటర్ ఇచ్చాడు. ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేసి ఇంటర్నెట్‎ను షేక్ చేశాడు. పవన్పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.వైసీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తోంద్న పవన్ కల్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటి వరకు చేసిన ఆరోపణలకన్నింటికీ పరాకాష్ట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ల దగ్గర ఈ విషయం మీద ఆధారాలుంటే యాక్షన్ తీసుకోకుండా పీకే చెవిలో ఎందుకు చెప్పారు??" అని ఆర్జీవీ ప్రశ్నించారు. "ప్రజల కోసం పని చేసే వైసీపీ వాలంటీర్లని పవన్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడని వాలంటీర్లకి సిగ్గు శరం ఆత్మాభిమానం ఉంటే వెంటనే పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.. పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు?" అని నిలదీశారు. 9/11 అటాక్ లో జగన్ పాత్ర ఉందనే స్థాయిలో సైతం పవన్ ఆరోపించినా ఆశ్చర్యం లేదనే ఆర్జీవీ మరో ట్వీట్ లో వెటకారం చేశారు.

Updated : 16 July 2023 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top