Nagarjuna Sagar : సాగర్ డ్యాం వద్ద టెన్షన్ టెన్షన్.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
X
నాగార్జున సాగర్ డ్యాం విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కయ్యానికి కాలుదువ్వుతున్న ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్ నాగార్జునసాగర్ పీఎస్లో కంప్లైంట్ చేశారు. అర్థరాత్రి సమయంలో అనుమతిలేకుండా డ్యాంపైకి రావడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అందులో రాశారు. ఫిర్యాదు ఆధారంగా నాగార్జునసాగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఏపీ పోలీసులతో పాటు ఇరిగేషన్ అధికారులను నిందితులుగా చేర్చారు.
ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఇరు రాష్ట్రాల పోలీసుల వలయంలో చిక్కుకుంది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి త రెండు రోజులుగా సాగర్ వద్దే మకాం వేశారు. ఏపీ జలవనరుల శాఖ అధికారులు గురువారం సాగర్ కుడి కాలువకు తాగునీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో సాగర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని తెలంగాణ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్షిస్తున్నారు.