చంద్రబాబు, దేవినేని ఉమ లపై కేసు నమోదు
X
అన్నమయ్య జిల్లా ముదివేడు పీఎస్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, దేవినేని ఉమ ల మీద కేసులు నమోదయ్యాయి. ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలను చేసినందుకు గానూ వీరిద్దరి మీద కేస్ ఫైల్ అయింది.
ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే ఇలాగే అవుతంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి నా కొడకల్లారా....వాళ్ళను తరమండి రా అంటూ టీడీపీ నేత చంద్రబాబు తన పార్టీ కార్యకర్తను పోలీసుల మీదకు రెచ్చగొట్టారు. పుంగనూరులో పోలీసుల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఆ బట్టలు తీసెయ్యిండిరా...అందరూ పెయిడ్ ఆర్టిస్ట్ లే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పోలీసుల మీద దాడి కేసులో ఇప్పటివరకు 74 మందిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. డీఎస్పీ, సుధాకర్ రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల మీద 5 కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు పరారీలో ఉన్నారు. అయితే అతని పీఏ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. పథకం ప్రకారమే దాడి చేశామని పీఏ పోలీస్ రిమాండ్ లో తెలిపాడు.