Kasani Gnaneshwar : తెలంగాణ టీడీపీలో రచ్చ.. కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రచ్చ జరుగుతోంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయగా.. కీలక నేతల మధ్యున్న గొడవలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జ్ఞానేశ్వర్‌పై పోలీస్ కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ లోని టీడీపీ కార్యాలయానికి తనను వెళ్లకుండా అడ్డుకున్నారని, అడిగినందుకు తనపై దాడి చేశారని గోషామహల్ సమన్వయకర్త డాక్టర్ ఏ.ఎస్. రావు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
గతనెలలో జరిగిన పార్టీ సమావేశానికి రావాలని ఏ.ఎస్. రావుకు ఫోన్ కాల్ రాగా.. అక్కడికి వెళ్లారు. సమావేశానికి వెళ్లగా పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్ తదితరులు తనపై దాడి చేశారని, దానివల్ల తలన కుడికంటిపై గాయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏ.ఎస్. రావుపై రివర్స్ లో కేసు ఫైల్ అయింది. సమావేశానికి వచ్చిన ఏ.ఎస్.రావు అందరితో అమర్యాదగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేశారని గోషామహల్ టీడీపీ ఇన్ చార్జ్ ప్రశాంత్ యాదవ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. పరస్పర ఫిర్యాదులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా