Home > ఆంధ్రప్రదేశ్ > హైకోర్టు బెయిలిచ్చినా అవినాష్ రెడ్డి అరెస్ట్.. సీబీఐ ఏం చేసిందంటే..?

హైకోర్టు బెయిలిచ్చినా అవినాష్ రెడ్డి అరెస్ట్.. సీబీఐ ఏం చేసిందంటే..?

హైకోర్టు బెయిలిచ్చినా అవినాష్ రెడ్డి అరెస్ట్.. సీబీఐ ఏం చేసిందంటే..?
X

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినా సీబీఐ మాత్రం అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాల దృష్ట్యా వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులపై అవినాష్ ను విడుదల చేసింది. వైఎస్ వివేకా కేసులో నిందితుల జాబితాలో ఏ-8గా అవినాష్ పేరును చేర్చింది. ఈనెల 3న ఈ తతంగం జరిగినా అరెస్టు విషయాన్ని ప్రకటించకుండా గోప్యంగా ఉంచింది.

అరెస్ట్ చూపి

ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు మే 31న ఆదేశాల జారీ చేసింది. ఈ క్రమంలో గత శనివారం జూన్ 3న ఆయన విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. ఆ రోజున అధికారులు అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి వెంటనే విడుదల చేశఆరు. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఇదే కేసులో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఎంక్వైరీకి డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఏదో ఒక సాకు చెబుతూ విచారణకు గైర్హాజరయ్యారు.

విచారణకు డుమ్మా

ఇదిలాఉంటే సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముండటంతో అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టుకు వేసవి సెలవుల దృష్ట్యా ఆయన పిటిషన్ పై విచారణ జరగలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా అనారోగ్యంపాలైన తన తల్లి హాస్పిటల్ లో ఉందని ఆమె బాగోగులు చూసుకోవాల్సి ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐకు లేఖ పంపారు. ఈ క్రమంలో కర్నూలు వెళ్లిన సీబీఐ టీం అవినాష్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నించింది. అయితే ఆసుపత్రి ముందు ఆయన అనుచరులు పెద్దఎత్తున మోహరించడంతో స్థానిక ఎస్పీ సాయం కోరింది. శాంతి భద్రతల సాకుతో పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. మరోవైపు హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అరెస్ట్ గురించి చెప్పని అవినాష్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 31న తీర్పు వెలువరించింది. ఒకవేళ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సి వస్తే పూచీకత్తు తీసుకొని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో జూన్ 3న అవినాష్‌రెడ్డి సీబీఐ ఆఫీసుకు విచారణ నిమిత్తం వెళ్లినప్పుడు టెక్నికల్గా అరెస్ట్‌ చూపి అనంతరం పూచీకత్తుపై విడుదల చేసింది. అయితే అరెస్ట్‌, విడుదల విషయాన్ని అటు సీబీఐ గానీ, ఇటు అవినాష్‌రెడ్డి గానీ బయటపెట్టకపోవడం విశేషం.

Updated : 9 Jun 2023 8:03 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top