Home > ఆంధ్రప్రదేశ్ > వివేకా హత్య కేసు.. నిన్‌ హైడ్రిన్‌ టెస్ట్కు సీబీఐ కోర్టు అనుమతి

వివేకా హత్య కేసు.. నిన్‌ హైడ్రిన్‌ టెస్ట్కు సీబీఐ కోర్టు అనుమతి

వివేకా హత్య కేసు.. నిన్‌ హైడ్రిన్‌ టెస్ట్కు సీబీఐ కోర్టు అనుమతి
X

వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. వివేకా హత్యకు గురైన స్థలంలోనే ఓ లేఖ దొరికింది. ఆ లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్ఎస్ఎల్కు పంపించింది. ఈ లేఖను పరీక్షించిన నిపుణులు అది వివేకానే రాశారని తేల్చారు. అయితే అది ఆయన ఒత్తిడిలో రాసినట్లు వివరించారు.

లేఖలో చేతి రాతతో పాటు లేఖపై ఉన్న వేలిముద్రలు కూడా గుర్తించాలని సీబీఐ కోరింది. దీనికి నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాలని ఫోరెన్సిక్ అధికారులు సీబీఐకి సూచించారు. అయితే ఈ పరీక్ష చేయడం వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరారు. రికార్డుల్లో ఒరిజినల్‌ లేఖ బదులు కలర్‌ జిరాక్స్‌ అనుమతించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు అనుమతిచ్చింది.

మరోవైపు ఈ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాశ్‌పై సీబీఐ ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జిషీట్లు, అఫిడవిట్లు అన్నీ తీవ్రమైనవేని కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని సునీత అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆయన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె పిటిషన్లో కోరారు.

Updated : 7 Jun 2023 5:49 PM IST
Tags:    
Next Story
Share it
Top