వైఎస్ వివేకా కేసు.. సీబీఐ ఛార్జ్‌షీట్ రిజెక్ట్ చేసిన కోర్టు.. ఆ తర్వాత..
X
వైఎస్ వివేకా హత్య కేసులో అనూహ్య పరిణామం జరిగింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు వెనక్కి పంపింది. కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపుతూ సిబీఐ కోర్టు తిరస్కరించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఛార్జ్‌షీట్‌లో వివేకానంద రెడ్డి హత్యకు జరిగిన కుట్ర, కొంతమంది కీలకమైన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో సీబీఐకి డెడ్ లైన్ పెట్టింది. ఈ మేరకు జూన్ 30 వరకూ దర్యాప్తును పూర్తి చేసిన సీబీఐ.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే టెక్నికల్ రీజన్స్తో ఈ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో సీబీఐ తప్పుల్ని సరిచేసి తిరిగి ఛార్జిషీట్ దాఖలు చేసింది.
హైకోర్టులో దస్తగిరి పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో ఛార్జ్‌షీట్ తిరస్కరించిన అంశం బయటపడింది. అయితే సరిచేసిన ఛార్జ్‌షీట్ కాపీలో ఎలాంటి అంశాలను సీబీఐ మెన్షన్ చేసిందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు వివేకా కేసులో మూడు ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా పేర్కొంది.
2019 మార్చి 14న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య కేసును తొలుత సిట్ విచారించింది. అయితే ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని వివేకా కూతురు వైఎస్ సునీతా రెడ్డి కోర్డును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుపుతోంది. అయితే జూన్ 30లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించండంతో చివరి రోజు ఛార్జిషీట్ దాఖలు చేసింది.
cbi court rejects cbi chargsheet on ys viveka case
ys viveka case,ys avinash reddy,kadapa mp,cbi,ys jagan,andhra pradesh,ycp,tdp,