వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్‌పై సీబీఐ కోర్టు తీర్పు
X
వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తును, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
బెయిల్ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో కీలక విషయాలను ప్రస్తావించింది. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్ రెడ్డిల ప్రమేయం ఉందన్న సీబీఐ.. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకొడుకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అదేవిధంగా అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది.
కాగా భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భాస్కర్‌రెడ్డి అరెస్టుకు రెండు రోజుల ముందే ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గుజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వివేకా హత్యకు ముందురోజు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు.
cbi court rejects the ys bhaskar reddy bail
ys bhaskar reddy,cbi,ys avinash reddy,kadapa mp,cm jagan,ys viveka,andhra pradesh