Home > ఆంధ్రప్రదేశ్ > ముగిసిన అవినాష్ విచారణ.. 7గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ..

ముగిసిన అవినాష్ విచారణ.. 7గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ..

ముగిసిన అవినాష్ విచారణ.. 7గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ..
X

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. శనివారం ఉదయం 9.40 గంటలకు తన నివాసం నుంచి ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. వారు దాదాపు 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు.

కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు అవినాష్ నుంచి పలు అంశాలకు సంబంధించి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగిన అధికారులు ఆయన వాగ్మూలం నమోదుచేసినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు అవినాష్ ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో విచారణ ముగియడంతో ఆయన సీబీఐ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లారు.

ఆరు అంశాలపై అవినాష్ రెడ్డి స్పష్టత ఇవ్వాల్సి ఉందని గతంలో సీబీఐ చెప్పింది. వీటి ఆధారంగా సీబీఐ విచారణ సాగినట్లు తెలుస్తోంది. వచ్చే శనివారం కూడా విచారణలో ఈ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వివేకా కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు జూన్ 30 వరకు ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన ఇవాళ సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.

Updated : 3 Jun 2023 9:23 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top