Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో భారీగా నకిలీ ఓట్లు....ఎన్నికల కమిషనర్‌కు సీఈసీ పిలుపు

ఏపీలో భారీగా నకిలీ ఓట్లు....ఎన్నికల కమిషనర్‌కు సీఈసీ పిలుపు

ఏపీలో భారీగా నకిలీ ఓట్లు....ఎన్నికల కమిషనర్‌కు సీఈసీ పిలుపు
X

ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను అర్జెంటుగా ఢిల్లీ రావాలాని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఓటర్ల జాబితా పాటు ప్రధాన ఫైళ్లను తీసుకురావాలని ముకేష్ కుమార్‎కు సీఈసీ నుంచి కబురొచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్ల చేర్చడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, పలు పార్టీలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేశాయి. అదే విధంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భారీగా ఓట్ల గల్లంతవుతున్నాయంటూ మరోసారి ఫిర్యాదులు వెలువెత్తాయి. తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను వైసీపీ ప్రభుత్వం ప్రభావంతో తొలగిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు పిలుపు రావడం చర్చనీయాంశమైంది.

Updated : 11 July 2023 4:24 PM IST
Tags:    
Next Story
Share it
Top