Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో వాలంటీర్లకు ఎన్నికల విధులపై సీఈసీ క్లారిటీ

ఏపీలో వాలంటీర్లకు ఎన్నికల విధులపై సీఈసీ క్లారిటీ

ఏపీలో వాలంటీర్లకు ఎన్నికల విధులపై సీఈసీ క్లారిటీ
X

ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో పార్టీలన్నీ వేగం పెంచాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల జంపింగ్లు కొనసాగుతోన్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తుండగా.. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఈసీ తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విధుల్లో గ్రామ వాలంటీర్లను తీసుకోవాలా..?వద్దా..? అనేదానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అయితే వాలంటీర్లు సహా సిబ్బందికి ఇంకు రాసే విధులు మాత్రమే అప్పగించాలని సీఈసీ స్పష్టం చేసింది. ముఖ్యమైన ఎన్నికల పనులు వారికి అప్పగించొద్దని సీఈవోకు సూచించింది. కాగా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లాగ పనిచేస్తున్నారని టీడీపీ-జనసేన ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈసీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated : 14 Feb 2024 9:24 PM IST
Tags:    
Next Story
Share it
Top