Chandra Babu : 45ఏండ్లలో ఏ తప్పు చేయలేదు.. చెయ్యను..- చంద్రబాబు
X
45 ఏండ్ల రాజకీయ జీవితంలో తాను ఏ తప్పు చేయలేదని, ఎప్పటికీ చెయ్యనని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను చేసిన అభివృద్ధిని 52 రోజులు గుర్తు చేసుకున్నారని, తనపై చూపుతున్న అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. కష్టంలో ఉన్న తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. తాను చేపట్టిన విధానాల వల్ల లబ్ది పొందిన వారంతా స్పందించడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు.
జైలులో ఉన్న తనకు అండగా నిలిచిన వివిధ పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. తనకు సహకరించిన జనసేనకు, పవన్ కల్యాణ్కు మనస్పూర్తిగా అభినందలు తెలిపారు. తన కోసం పూజలు, ప్రార్థనలు చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో సంఘీభావం తెలపడాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వారు చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు.