Home > ఆంధ్రప్రదేశ్ > Ap politics : అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ

Ap politics : అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ

Ap politics : అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ
X

బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ ముగిసింది. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై గంటకు పైగా చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయేలోకి టీడీపీని ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య దాదాపు అవగాహన కుదిరినట్లే.





అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో టీడీపీ, జనసేన నేతలతో దాదాపు గంట పాటు భేటీ జరిగింది. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పొత్తులపై ఇరు నేతలు మాట్లాడారు. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇవాళ అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సమావేశంలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కోరినట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 5 సీట్లు ఇస్తే జనసేనకు 3 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాగా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.




Updated : 9 March 2024 7:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top