Chandrababu Bail Petition: చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
X
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదపరి విచారణను న్యాయస్థానం నవంబర్ 7కు వాయిదా వేసింది. అప్పటివరకు బాబును అరెస్ట్ చేయొద్దని సూచించింది. ఈ కేసులో ఇవాళ్టి వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్ 7కు హైకోర్టు వాయిదా వేసింది.
మరోవైపు బాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. టీడీపీ బృందానికి సాయంత్రం 5గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టులో 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించనున్నారు. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా.. నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్‌ను కలవనున్న వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.