Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబును విడుదల చేయండి.. మోదీకి టీడీపీ విజ్ఞప్తి

చంద్రబాబును విడుదల చేయండి.. మోదీకి టీడీపీ విజ్ఞప్తి

చంద్రబాబును విడుదల చేయండి.. మోదీకి టీడీపీ విజ్ఞప్తి
X

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పంచాయతీ పార్లమెంటుకు చేరింది. టీడీపీ, వైసీపీ సభ్యులు దుమ్మెత్తిపోసుకున్నారు. బాబును రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్ట్ చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభ్యంతం చెప్పడంతో కాసేపు వాగ్యుద్ధం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అవినీతికి బలమైన ఆధారాలు ఉన్నాయని మిథున్ అన్నారు. చంద్రబాబు నకిలీ జీవోలను సృష్టించి రూ.371 కోట్లు దోచుకున్నారని, ఈడీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పిందని అన్నారు. ‘‘చంద్రబాబు నీతిపరుడని అంటున్నారు. ఆయన పీఏ మాత్రం దేశం విడిచి పారిపోయాడు’’ అని అన్నారు.

చంద్రబాబును ఇబ్బందిపెట్టడానికే అక్రమంగా అరెస్ట్ చేశారని గల్లా జయదేవ్ మండిపడ్డాడు. ‘‘ఆయనను అరెస్ట్ చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డే. చంద్రబాబు అనేక ఆర్థిక సంస్కరణలతో ప్రగతికి బాటలు వేశారు. ఐటీని రంగం ఆయన వల్లే బలోపేతమైంది. జగన్ చట్టాలను తుంగలో తొక్కి ఆయనను అరెస్ట్ చేసింది. అందుకే ఈ విషయాన్ని ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలను అడ్డుకుని చంద్రబాబును విడుదల చేయించాలని కోరుతున్నాను’’ అని మిథున్ అన్నారు.

Updated : 18 Sept 2023 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top