Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: 5 కిలోల బరువు తగ్గిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

Chandrababu: 5 కిలోల బరువు తగ్గిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

Chandrababu: 5 కిలోల బరువు తగ్గిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును సీఐడీ నుంచి సీబీఐకి ఇవ్వాలని చంద్రబాబు తరుపు న్యాయవాది ఉండవల్ల అరుణ్ కుమార్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించింది. అంతేకాకుండా తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాత చేపట్టబోతున్నట్లు తెలిపింది. కాగా అంగళ్లు కేసులో చంద్రబాబుకు హైకోర్ట్ లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్ట్ ఆమోదించింది. అంతేకాకుండా రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

(Chandrababu)చంద్రబాబు సకాలంలో వైద్యం అందించలేదని నారా బ్రాహ్మణి ఆరోపించారు. బాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, అదే కొనసాగితే కిడ్నీ సంబంధిత వ్యాదులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జైల్లో పారిశుద్ధ్యం సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న చంద్రబాబును.. ములాఖత్ లో భాగంగా పలు మార్లు కలిసిన బ్రాహ్మణి.. ఆయన ఆరోగ్యం, అక్కడి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.





Updated : 13 Oct 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top