ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
X
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాబును రాజమండ్రి జైలుకు తరలించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ క్రమంలో అదే కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. చివరకు సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బాబుకు రిమాండ్ విధించింది