Chandrababu arrest: చంద్రబాబుకు హైబీపీ, షుగర్.. విజయవాడకు తరలింపు
X
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలోని ఆర్.ఫంక్షన్ హాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేశాక సీఐడీ పోలీసుల ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దాంతో చంద్రబాబుకు హైబీపీ, షుగర్ ఉన్నాయని తేలింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున మెరుగైన వైద్యం కోసం.. లాయర్లు హైకోర్ట్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు టిఫిన్ చేయించిన సీఐడీ.. ఆయన కాన్వాయ్ లోనే ఎన్ఎస్జీ భద్రతతో విజయవాడకు తరలించారు. కాగా ఇప్పటికే అరెస్ట్ కు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. ఒకవేళ హైకోర్ట్ నుంచి బెయిల్ వస్తే చంద్రబాబును మెరుగైన వైద్య సేవలకోసం హాస్పిటల్ తరలిస్తారు. CRPC సెక్షన్ 50(1) కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.