Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్.. తీర్పు వాయిదా

చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్.. తీర్పు వాయిదా

చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్.. తీర్పు వాయిదా
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన హస్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు మంగళవారానికి (సెప్టెంబర్ 12) మధ్యాహ్నానికి వాయిదా పడింది. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని కోర్టుకు వివరించారు. బాబు తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమవారం (సెప్టెంబర్ 11) సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. కాగా రేపు కోర్టు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు విషయంలో కోర్టు, జైలుతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు భద్రత కల్పిస్తామని తెలిపారు. 24 గంటలు పోలీసులు, అత్యవసర పరిస్థితులకోసం వైద్య సిబ్భంది అందుబాటులో ఉంటుందని తెలపారు. దీంతో బాబుకు కోర్టులో ఊరట లభిస్తుందా? లేదా? అని టీడీపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Updated : 11 Sept 2023 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top