Home > ఆంధ్రప్రదేశ్ > జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని : అడ్వకేట్ లూథ్రా

జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని : అడ్వకేట్ లూథ్రా

జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని : అడ్వకేట్ లూథ్రా
X

చంద్రబాబు అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్నారు. బాబును జైల్లో ఉంచడం ప్రమాదకరమని.. హౌస్ రిమాండ్కు అనుమతించేలా కోర్టును కోరతామని చెప్పారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా హౌస్ రిమాండ్ పిటిషన్పై గట్టి వాదనలు వినిపిస్తామన్నారు.

2021లో పశ్చిమబెంగాల్‌లో ఒకే కేసులో ఐదుగురు మంత్రులకు కోర్టు రిమాండ్ విధించిందని... అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హౌస్ రిమాండ్ విధించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే తరహా హౌస్ రిమాండ్‌ వర్తించేలా కోర్టును కోరతామన్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్ తర్వాత హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని లూథ్రా చెప్పారు.



Updated : 11 Sept 2023 1:16 PM IST
Tags:    
Next Story
Share it
Top