Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
X

తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకల్లో టీడీపీ నేతలు, జనసేన నేతలు భారీగా తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ తో కలిసి భోగి మంటలు అంటించారు చంద్రబాబు.

కౌంట్ డౌన్ ప్రారంభమైంది..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ‌ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఈ ఐదేళ్లు వారికి చీకటి రోజులని చెప్పారు. ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. ‘ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి’ అని వ్యాఖ్యానించారు. ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌’ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను భోగి మంటల్లో తగలబెట్టారు.

రోజులు దగ్గరపడ్డాయ్..

వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలోనే రైతుల సంకల్పం నెరవేరుతుందన్నారు. బంగారు రాజధాని నిర్మించుకుందామన్నారు. ఇది కేవలం అమరావతి సమస్య కాదు.. 5కోట్ల మంది ప్రజలదని పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు.మందడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు టీడీపీ, జనసేన కార్యకర్తలతోపాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేతలు ఇద్దరూ కలిసి భోగిమంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు.చంద్రబాబు, పవన్ ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు.

Updated : 14 Jan 2024 10:50 AM IST
Tags:    
Next Story
Share it
Top