Home > ఆంధ్రప్రదేశ్ > తెలుగు రాష్ట్రాల్లో జైలుకెళ్లిన తొలి మాజీ సీఎంగా చంద్రబాబు..

తెలుగు రాష్ట్రాల్లో జైలుకెళ్లిన తొలి మాజీ సీఎంగా చంద్రబాబు..

తెలుగు రాష్ట్రాల్లో జైలుకెళ్లిన తొలి మాజీ సీఎంగా చంద్రబాబు..
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నెల 22వరకు ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో 73ఏళ్ల వయస్సులో బాబు జైలుకు వెళ్లారు. ఇప్పటికే దేశంలో చాలా మంది మాజీ సీఎంలు అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ఎంతోమంది జైలుకు వెళ్లారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారి.

ఉమ్మడి ఏపీలో సీఎంగా పనిచేసిన నాయకుడు అవినీతి కేసులో జైలు కెళ్లడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏ మాజీ సీఎం అవినీతి ఆరోపణల్లో జైలుకు వెళ్లలేదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబుపై అనేక అవినీతి కేసులు నమోదయ్యాయి. కానీ బాబు ఏ కేసులోనూ అరెస్ట్ కావడం, జైలుకెళ్లడం జరగలేదు. తొలిసారి చంద్రబాబు అవినీతి ఆరోపణల కేసులో జైలుకు వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

కాగా మొదట రూపొందించిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ-1గా చేర్చి.. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టే టైంలో ఏ-37గా సిట్ పేర్కొంది. నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. మొత్తం 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని.. ఇందులో రూ.271 కోట్లను షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14రోజుల రిమాండ్ విధించింది.

Updated : 11 Sept 2023 8:23 AM IST
Tags:    
Next Story
Share it
Top