Breaking news : చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. రాజమండ్రి జైలులో ఉన్న ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ సమయం ముగియడంతో పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. 24వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్లో ఉంటారని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రిమాండ్లో ఏమైన ఇబ్బందులు కలిగాయా అని చంద్రబాబును జడ్జి అడిగారు. అంతేకాకుండా పోలీసు కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని తెలసుకున్నారు. ‘‘మిమ్మల్ని కస్టడికి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. కానీ మీ లాయర్లు కస్టడీ వొద్దని వాదించారు’’ అని జడ్జి బాబుతో అన్నారు. అయితే తనను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని.. తన గురించి ఏపీ ప్రజలకు ప్రపంచానికి తెలుసు అని బాబు అన్నారు. కాగా రిమాండ్ను శిక్షగా భావించొద్దని.. విచారణలో అన్నీ తేలుతాయని జడ్జి చెప్పారు. ఒకవేళ జైల్లో ఏమైన ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు.