Home > ఆంధ్రప్రదేశ్ > ఆ లెటర్ జైలు నుంచి రాలేదు: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్

ఆ లెటర్ జైలు నుంచి రాలేదు: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్

ఆ లెటర్ జైలు నుంచి రాలేదు: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు రాసినట్లుగా వైరల్ అవుతున్న ఈ లేఖపై రాజమండ్రి జైలు అధికారులు క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లెటర్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. చంద్రబాబు పేరుతో సర్కులేట్ అవుతున్న లెటర్ జైలు నుండి వచ్చింది కాదు అని తెలిపారు.

'చంద్రబాబు సంతకంతో, స్నేహ బ్లాక్, రాజమహేంద్రవరం జైలు పేరున సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అవుతున్న కరపత్రం గురించి తెలియజేయునది ఏమనగా, సదరు కరపత్రము కారాగారము నుంచి జారీ చేయబడినది కాదు. కారాగార నియమావళి ప్రకారం.. ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన కరపత్రములు బయటకు విడుదల చేయదలచినచో, సదరు పత్రమును జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి సదరు పత్రముపై జైలరు ధృవీకరించి, సంతకం, కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు, కుటుంబసభ్యులకు పంపబడును. కావున పైన చూపబడిన కరపత్రమునకు, ఈ కారాగారమునకు ఏ విధమైన సంబంధము లేదని తెలియపరచుచున్నాము' అని సెంట్రల్ జైలు సూపరిండెంట్ వెల్లడించారు.

అయితే, అంతకు ముందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఓ లేఖ విడుదల అయింది. ఆ లేఖలో నేను జైలులో లేను.. మీ అందరి గుండెల్లో ఉన్నాను.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను అని ఆయన తెలిపారు. విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో నేను ఉన్నాను.. ప్రజలే నా కుటుంబం.. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది అని చంద్రబాబు అన్నారు.


Updated : 23 Oct 2023 9:11 AM IST
Tags:    
Next Story
Share it
Top