Home > ఆంధ్రప్రదేశ్ > సుప్రీం కోర్టుకు చంద్రబాబు.. హైకోర్టు తీర్పుపై..

సుప్రీం కోర్టుకు చంద్రబాబు.. హైకోర్టు తీర్పుపై..

సుప్రీం కోర్టుకు చంద్రబాబు.. హైకోర్టు తీర్పుపై..
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పటిషన్ దాఖలు చేశారు.17(A) సెక్షన్ చంద్రబాబుకు వర్తింస్తుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు శక్రవారం తీర్పునిచ్చింది.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును సీఐడీ విచారిస్తోంది. బాబును రెండు రోజుల కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు బాబును అధికారులు విచారించనున్నారు. తిరిగి రేపు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారిస్తారు. కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరుస్తారు.




Updated : 23 Sept 2023 12:52 PM IST
Tags:    
Next Story
Share it
Top